ఐదు నెలల్లోనే ప్రభుత్వం విఫలమైంది: సుజనా చౌదరి

Update: 2019-10-31 12:28 GMT

5 నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ విఫలమైందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. చిన్న ఇసుక సమస్యను కూడా పరిష్కరించలేకపోయారంటూ మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్‌ అంటూ ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తి కూడా ఆగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తున్నారని సుజనా మండిపడ్డారు.

మరోవైపు.. వల్లభనేని వంశీ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. రెండు రోజుల నుంచి వంశీ తనతో టచ్‌లో లేరని చెప్పారు. గత సమావేశం సమయంలోనూ తమ మధ్య ఎలాంటి రాజకీయాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు. వంశీతోపాటు ఎవరు బీజేపీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు సుజనా చౌదరి.

Similar News