కలెక్టరేట్‌ ఎదుట కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం

Update: 2019-11-01 13:29 GMT

అనంతపురం కలెక్టరేట్‌ ముందు ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. రిజర్వుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటరమణ వేధింపులకు గురి చేస్తున్నారంటూ.. కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ కలెక్టరేట్‌ ఎదుట ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇంతలో పక్కనే ఉన్న పోలీసులు అతణ్ని అడ్డుకుని.. కిరోసిన్‌ డబ్బా లాక్కున్నారు. సంఘటన గురించి తెలుసుకున్న కలెక్టర్‌ స్వయంగా వచ్చి వివరాలు కనుక్కున్నారు. ఇన్స్‌పెక్టర్‌ వెంకటరమణ, కానిస్టేబుల్‌ హరి రూ.60 లక్షల మేర అవినీతికి పాల్పడ్డారని.. తనను నిత్యం కులం పేరుతో దూషిస్తున్నారని.. కానిస్టేబుల్‌ ప్రకాశ్ ఆరోపించారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడం వల్లే ఆత్మహత్యకు యత్నించానని ప్రకాశ్‌ తెలిపాడు.

Similar News