ఆర్టీసీ సమ్మెపై విచారణ 7వ తేదీకి వాయిదా

Update: 2019-11-01 12:19 GMT

ఆర్టీసీ సమ్మెపై విచారణ ఈ నెల 7వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. శుక్రవారం సుదీర్ఘ వాదనల తరువాత.. ఆర్టీసీ తీరుపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఇంఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టుకు ఇచ్చిన నివేదికలో పూర్తి స్థాయి వివరాలు ఇవ్వరా? సగం సగం వివరాలతో ఎలా నివేదిక ఇస్తారని నిలదీసింది.

మరోవైపు చట్ట ప్రకారం ఆర్టీసికి జీహెచ్‌ఎంఎసీ బకాయిలు చెల్లించాల్సి ఉందా లేదా అని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంఎసీ కట్టలేదు.. లాస్‌లో ఉంది అని పదే పదే చెబుతున్నారు.. మీరు ఆర్టీసీ కోసం పని చేస్తున్నారా లేకా.. జీహెచ్‌ఎంఎసీ కోసం పని చేస్తున్నారా అని సునీల్ శర్మపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఇప్పటి వరకు సమర్పించిన రెండు అఫిడవిట్లు అసంబద్ధంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. పూర్తి నివేదికతో మరోసారి రావాలని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

Similar News