ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోందంటూ విపక్షాలు మండి పడుతున్నాయి. జీవో నెంబర్ 2430 కాపీలను టీడీపీ నేతలు తగులబెట్టారు. అటు.. బీజేపీ నాయకులు సైతం.. ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. భావ ప్రకటన స్వేచ్ఛ కోసం అన్ని వర్గాలు ఐక్యమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.