పోలవరం ప్రాజెక్ట్ భూమిపూజ అడ్డుకున్న సబ్ కాంట్రాక్టర్లు

Update: 2019-11-01 11:04 GMT

పోలవరం ప్రాజెక్టు వద్ద భూమిపూజ నిర్వహించేందుకు వచ్చిన మెగా సంస్థ ఇంజినీర్లు, అధికారులను సబ్‌కాంట్రాక్టర్లు అడ్డుకున్నారు. గతంలో తాము చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన నిధులు ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. మెగా ఇంజినీర్లు, అధికారులు, యంత్రాలను ప్రాజెక్టు వద్దకు పంపించారు. దీంతో అక్కడ భూమి పూజ నిర్వహించారు మెగా సంస్థ ప్రతినిధులు. శనివారం నుంచి పనులను ముమ్మరం చేస్తామన్నారు. అటు సబ్‌కాంట్రాక్టర్ల ఆందోళనపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ స్పందించారు. రావాల్సిన బకాయిలతో మెగా సంస్థకు సంబంధం లేదని.. గతంలో పనులు చేసిన నవయుగ కంపెనీని అడగాలన్నారు.

Similar News