విశాఖపట్నం చుట్టుపక్కల భూ అక్రమాలపై సిట్ విచారణ వేగవంతం చేసింది. మాజీ అధికారి ఐఏఎస్ విజయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం విశాఖలో విచారణ చేపట్టింది. శుక్రవారం నుంచి ఏడవ తారీఖు వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఉడా అరేనాలో సిట్ బృందం ఫిర్యాదులు స్వీకరించనుంది. నేరుగా ఫిర్యాదు చేయలేనివారు.. ఆన్ లైన్ లో కూడా తమ ఫిర్యాదులు అందజేయవచ్చని సిట్ తెలిపింది. సిట్ ఇచ్చిన ఫార్మెట్ లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.