ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆర్డీఎక్స్ పేలుడు పదార్ధాలు కలకలం రేపాయి. టెర్మినల్ 3లో అనుమానాస్పదంగా వదిలివెళ్లిన బ్యాగులో ఆర్డీఎక్స్ ఉన్నట్టు గుర్తించిన భద్రతా బలగాలు.. బ్యాగును అక్కడి నుంచి తరలించారు. ఎయిర్ పోర్టు మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని.. బ్యాగును అక్కడి నుంచి తరలించే వరకూ ఎవరినీ అనుమతించలేదు. ఇంకా ఏమైనా పేలుడు పదార్ధాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు.