మరో భవన నిర్మాణ కార్మికుడి ఆత్మహత్య

Update: 2019-11-02 05:47 GMT

ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇసుక కొరతతో పనుల్లేక.. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ప్రాణాలు తీసుకుంటున్నారు కార్మికులు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కూలీలు ఆకలితో అలమటిస్తూ.. మనస్థాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో మరో భవన నిర్మాణ కార్మికుడి ఊపిరి ఆగింది. తాడేపల్లి మండలం ఉండవల్లిలో తాపీ పని చేసే కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇసుక కొరతతో గతకొంత కాలంగా ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులకు గురైన కార్మికుడు ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Similar News