చిదంబరానికి మరోసారి నిరాశ

Update: 2019-11-02 03:31 GMT

INX మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు ఆయన ఆరోగ్యం సంతృప్తికరంగా ఉందని నివేదిక ఇవ్వడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. చిదంబరంకు మినరల్‌ వాటర్‌తో పాటు ఇంటి ఆహారాన్నే సమకూర్చాలని కోర్టుకు మెడికల్‌ బోర్డు సూచించింది. ఈ నివేదిక ఆధారంగా చిదంబరానికి సురక్షిత పరిసరాలు ఉండేలా చూడటంతో పాటు.. దోమల నుంచి రక్షణ కల్పించాలని తీహార్‌ జైలు అధికారులను ఆదేశించింది న్యాయస్థానం.

ఇక ఇదే కేసులో ప్రధాన బెయిల్‌ పిటిషన్‌ ఈనెల 4న విచారణకు రానుంది. మరోవైపు INX మీడియాపై సీబీఐ కేసులో చిదంబరానికి బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.

Similar News