టీటీడీలో ఉద్యోగాలిస్తామంటూ.. భారీగా వసూళ్లు..

Update: 2019-11-03 11:41 GMT

టీటీడీలో ఉద్యోగాలిస్తామంటూ..భారీగా వసూళ్లకు పాల్పడిందో ముఠా. ఐదుగురు వ్యక్తులు కలిసి ఓ ముఠాగా ఏర్పడి నిరుద్యోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేశారు.. తిరుపతి టీచర్స్ కాలనీకి చెందిన మహేష్..లుక్‌ మీ మ్యాన్‌పవర్ పేరుతో టీటీడీ లడ్డూ కౌంటర్‌ ఏజెన్సీని తీసుకున్నాడు. తన స్నేహితులతో కలిసి ఈజీ మనీ సంపాదించేందుకు ఓ ప్లాన్ వేశాడు. టీటీడీకి చెందిన లడ్డూ కౌంటర్లతోపాటు, అన్నప్రసాదంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 30 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు.

గోపీ అనే వ్యక్తికి అన్నప్రసాదంలో సూపర్‌వైజర్‌గా జాబ్ ఇస్తామంటూ 57 వేలు తీసుకున్నారు.. తీరా సూపర్‌వైజర్ కాకుండా క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్‌ ఇచ్చారు.. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.. ఈ ఐదుగురు సభ్యుల ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా ఆధారాలతో నలుగురిని అరెస్ట్ చేశారు..అయితే ప్రధాన నిందితుడు మహేష్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.. అతడిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు పోలీసులు.

Similar News