సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగుల్లో కొందరు సమ్మె నుంచి బయటికి వస్తున్నారు. ఇందులో భాగంగా... ఉప్పల్ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగి కేశవకృష్ణ డ్యూటీలో జాయిన్ అయ్యారు. తాను విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు సమ్మతి పత్రం సమర్పించి... తిరిగి ఉద్యోగంలో చేరారు కేశవకృష్ణ.
భద్రాచలం, కామారెడ్డి, ఉప్పల్, హయత్ నగర్ డిపోల వద్ద తిరిగి విధుల్లో చేరడానికి ఆర్టీసీ కార్మికులు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 5 తేదీ అర్థరాత్రిలోగా డ్యూటీ చేరేవారిని తిరిగి సంస్థలో చేర్చుకుంటామని నిన్నటి కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం ప్రకటన తర్వాత కొందరు ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడానికి ఆసక్తికనబరుస్తున్నారు.
అటు కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన రెగ్యులర్ డ్రైవర్ సయ్యద్ హైమత్ తిరిగి విధుల్లో చేరారు. పాత బస్టాండ్‌లో DVM గణపతిరాజుకు హైమత్ రిపోర్ట్ చేశారు. ఉప్పల్, కామారెడ్డి డిపోలో ఉద్యోగులు చేరగా... సిద్దిపేట డిపోలో పనిచేస్తున్న కండక్టర్ పి.బాల విశ్వేశ్వరరావు కూడా విధుల్లో చేరారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యోగులు విధుల్లో చేరుతున్నారు.