వరంగల్‌లో 4రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ ఏరుకొండ రవీందర్ మృతదేహాన్ని సొంతూరైన ఆత్మకూరుకు తరలించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ.. భారీ కాన్వాయ్‌తో అర్ధరాత్రి రవీందర్ డెడ్‌బాడీనీ తరలించారు పోలీసులు. ఆర్టీసీ కార్మికుల ఆందోళన నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రవీందర్ ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. రవీందర్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. హన్మకొండ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న రవీందర్.. ఆర్టీసీ సమ్మె ప్రారంభం నుంచి నిరసనలో పాల్గొంటున్నారు. తీవ్ర మనస్థాపాలనికి గురైన ఇంట్లో టీవీ చూస్తుండగా గుండెపోటు వచ్చి కుప్పకూలీపోయాడు.