హైదరాబాద్ ఎర్రగడ్డ యునాని ఆసుపత్రిలో జాతీయ చర్మవ్యాధుల వైద్య పరిశోధనా సంస్థను... కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద యషో నాయక్‌తో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యునాని ఆసుపత్రిలో ఔషధ మొక్కలు నాటి, ఆసుపత్రి సేవలను మంత్రులు పరిశీలించారు.
ప్రజలకు యునాని మెడిసిన్‌ను మరింత దగ్గర చేయాల్సిన బాధ్యత ఉందన్నారు కిషన్ రెడ్డి. యునాని ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారాయన. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు కిషన్ రెడ్డి.