నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి అనిల్‌ను భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక సమస్యను పరిష్కరించి.. తమకు ఉపాధి కల్పించాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అనిల్.. ప్రస్తుతం భారీ వర్షాల వల్ల నదులు నిండి ఉన్నాయని, అందువల్లే ఇసుకకొరత ఏర్పడిందన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామంటూ భవననిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చారు.