కార్తీక సోమవారం సందర్భంగా గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారికి జరిగే మూలవిరాట్ అభిషేకాలు, మండప అభిషేకాల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు.
త్రికోటేశ్వరస్వామిని దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. తీర్థ ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు, అన్నదానం సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా సుమారు 30 వేల మంది భక్తులు వస్తారని అంచనావేస్తున్నారు అధికారులు. కార్తీక మాస శోభతో కోటప్పకొండలో పండుగ వాతావరణం నెలకొంది.