ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజారంజకంగా పాలిస్తే తాను ప్రశ్నించాల్సిన అవసరం రాదన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే ఎదురుదాడి చేయడం మంచిపద్దతి కాదని హితవు పలికారు.
ఇసుక విషయంలో వైసీపీ సర్కారు తీరు దారుణంగా ఉందన్నారూ పవన్ కళ్యాణ్. భవన నిర్మాణ కార్మికులకు అండగా లాంగ్‌మార్చ్ నిర్వహించామని చెప్పారు. సమస్యలు పరిష్కరించకపోతే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.