ఎస్‌బీఐ కస్టమర్లకు స్ట్రాంగ్ వార్నింగ్..

Update: 2019-11-04 05:47 GMT

 

ఎంత అలర్ట్‌గా ఉన్నా ఏదో ఒక దారిలో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు సైబర్ నేరగాళ్లు. దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను గట్టిగా హెచ్చరిస్తోంది. మొసగాళ్ళ వలలో పడి నష్టపోవద్దని పేర్కొంటోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కస్టమర్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపిస్తోంది. మీ మొబైల్‌కి ఎస్ఎమ్ఎస్ రూపంలో వచ్చే లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచిస్తోంది. మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ రద్దయింది. ఈ లింక్‌పై క్లిక్ చేసి మళ్లీ అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసుకోండి అంటూ సైబర్ మోసగాళ్లు ఎస్ఎమ్ఎస్‌లు పంపిస్తారని.. మీరు పొరపాటున లింక్‌పై క్లిక్ చేశారంటే.. మీ అకౌంట్లో సొమ్ము మొత్తం స్వాహా అయిపోతుంది.

పై ఫొటోలో పేర్కొన్న విధంగా మీకు ఎస్ఎమ్ఎస్ రావొచ్చని బ్యాంక్ తెలిపింది. వీటితో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ లింక్‌పై క్లిక్ చేయవద్దని సూచించింది. వ్యక్తిగత అకౌంట్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని తెలిపింది. కేవలం బ్యాంకుకు వెళ్లే అకౌంట్ స్టేటస్‌ను తెలుసుకోవాలని సూచించింది. ఇలాంటి మేసేజ్‌లు తరచుగా వస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే పోలీసులకు తెలియజేయాలని పేర్కొంది. బ్యాంకు ఎప్పటికీ కస్టమర్ల వివరాలను సేకరించదని స్పష్టం చేసింది. ఇకపోతే, రూ.లక్ష వరకు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గుతుంది. దాంతో ఈ అకౌంట్లపై వడ్డీరేటు 3.5 శాతం కాకుండా 3.25 శాతం వడ్డీ లభిస్తుంది.

Similar News