తమకు న్యాయం చేయాలంటూ కొందరు నిరుద్యోగులు పెట్రోల్ బాటిళ్లతో సెల్ టవర్ ఎక్కడంతో విజయవాడ బందర్‌రోడ్డులో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వం నిర్వహించిన గ్రామసచివాలయ పోటీ పరీక్షల్లో అర్హత సాధించిన తమకు కాల్‌లెటర్లు కూడా ఇచ్చారని.. ఇప్పుడు మాత్రం BZC చదివిన వారికి పోస్టులు లేవంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. చివరికి అధికారులు వారికి నచ్చచెప్పి కిందకు దించారు.