కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపింది. కౌతాళం మండలం, ఉరుకుందలోని అతిథి గృహం వెనక ఎముకలు, తల పుర్రెలు గుర్తించారు గ్రామస్తులు. అక్టోబర్ 27న దేవాలయం సమీపంలో అమావాస్య రోజు రాత్రి క్షుద్రపూజలు చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అజ్ఞాత స్వామిజీ ఈ పూజలు నిర్వహించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ క్షుద్రపూజలకు ఉరుకుంద ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని ఆలయ ఈఓ వాణి తెలిపారు.