నెల్లూరు జిల్లాలో దుండగులు ఆంధ్రాబ్యాంక్ ఏటీఎమ్ చోరీకి ప్రయత్నించారు. వేదయపాలెంలో మిషన్ ధ్వంసం చేసి ఏటీఎమ్‌లో ఉన్న డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ చేశారు. అయితే ఏటీఎమ్‌లో ఉన్న అలారం చోరీగాళ్ల ప్లాన్‌ను రివర్స్ చేసింది. సొత్తును ఎత్తుకుపోకుండా కాపాడగలిగింది. ఒక్కసారిగా అలారం మోగడంతో భయంతో దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. బ్యాంక్ సిబ్బంది.. చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఏటీఎమ్ చోరీ విఫలయత్నం కావడంతో బ్యాంక్ సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.