ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో మోసం చేయడానికి ఎదురుచూస్తుంటారు మోసగాళ్లు. వారి బారిన పడి మోసపోవద్దని మరోసారి హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. మీ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో వచ్చే లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచిస్తోంది. మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ రద్దయ్యింది. ఈ లింక్‌పై క్లిక్ చేసి అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసుకోండి అంటూ మోసగాళ్లు పంపించే ఎస్ఎమ్ఎస్‌లను అస్సలు పట్టించుకోవద్దని అంటోంది. పొరపాటున క్లిక్ చేసారంటే మీ అకౌంట్ వివరాలన్నీ వాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయని హెచ్చరిస్తోంది.
పై ఫోటోలో ఉన్న విధంగా మీకు ఎస్ఎంఎస్ వస్తే జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. వ్యక్తిగత వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని తెలిపింది. మీకేదైనా అనుమానం ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్లి నివృత్తి చేసుకోవాలని సూచించింది.