ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశం

Update: 2019-11-06 15:49 GMT

ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇసుక విధానంపై సీఎం కీలక సమావేశం నిర్వహించారు. ధరలకు కళ్లెం వేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ఆర్డినెన్స్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలు, నియోజకవర్గాల వారిగా ధరలను నిర్ణయించాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు చెప్పారు సీఎం. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పోలీసు, గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Similar News