కక్షసాధింపుతోనే నా ట్రావెల్ బస్సులను సీజ్ చేశారు : జేసీ దివాకర్ రెడ్డి
కక్షసాధింపుతోనే తనకు చెందిన ట్రావెల్ బస్సులను సీజ్ చేశారని ఆరోపించారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ట్రైబ్యునల్ ఆదేశించినా 15 బస్సులను ఆర్టీఓ కార్యాలయాల్లో ఉంచుకున్నారు. ఆర్థికంగా, మానసికంగా వేధించాలన్న లక్ష్యంతో రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై రోజుకు ఓ కేసు సృష్టించి పెడుతున్నారని అన్నారు. తమ పార్టీలోకి వస్తే ఇవన్నీ ఉండవని వేసీపీ నేతలు పేర్కొన్నారని తెలిపారు జేసీ దివాకర్ రెడ్డి.