యువకుడిని అర్ధనగ్నంగా చేసి హింసించిన..

Update: 2019-11-07 10:11 GMT

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కొంతమంది యువకులు రెచ్చిపోయి.. ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దుస్తులు విప్పి మరీ విచక్షణారహితంగా కొట్టారు. కొట్టొద్దని ఎంత వేడుకుంటున్న కణికరం లేకుండా యువకుడిని అర్ధనగ్నంగా చేసి చితకబాదారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

జబల్‌పూర్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య తగాదాలు ఉన్నాయి. దాంతో ఒక వర్గానికి చెందినవారు మరో వర్గానికి చెందిన యువకుడిని బంధించి చితకబాదారు. ఈ దృశ్యాలను కొందరు సెల్ ఫోన్‌లో రికార్డు చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. అప్రమత్తమైన పోలీసులు దాడికి పాల్పడిన కొందరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియో ఆధారంగా మూకదాడికి పాల్పడ్డ పోకిరీలపై చర్యలకు పోలీసులు ఉపక్రమించారు.

Similar News