వైన్ షాపుల ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఆనంద్ రెడ్డి అనే నిందితుడిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారని వెల్లడించారు బాలానగర్ ఏసిపి హనుమంతరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కేసులలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తుడు ఆనంద్ రెడ్డి తన బుద్ధి మార్చుకోకుండా మరల దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. చోరీ చేసినా వాహనాలకు సంబంధించి వాటి విడిభాగాలను తీసి అమ్మేస్తున్నాడని విచారణలో తేలింది అని తెలిపారు నింతుడిపైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అతని వద్ద ఉన్న 22 బైకులతో పాటు ఆటోని సీజ్ చేసి నిందితుడని రిమాండ్ కు తరలించినట్లు తెలియజేశారు