అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు.. ట్విట్టర్ పై నిఘా..

Update: 2019-11-08 01:13 GMT

ట్విట్టర్‌లో శ్రీరాముడు, సీత, రావణుడు, విభీషణుడు పేర్లతో పాటు దేవతల పేర్లతో అకౌంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పునివ్వనున్న నేపధ్యంలో ఇలాంటి అకౌంట్లపై యూపీ పోలీసులు నిఘా పెడుతున్నారు..సైబర్ నిపుణుల బృందం ఇదే పనిలో నిమగ్నమైంది. ఇలాంటి అకౌంట్లతో ఊహించని ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి ట్విట్టర్ ఖాతాలను సృష్టిస్తున్నవారు తమ పేరు, ఆచూకీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రాముడి ట్విట్టర్ ఖాతాలో అడ్రస్ వైకుంఠం అని రాశారు. అలాగే సీత చిరునామా అయోధ్య అని, విభీషణుడిన చిరునామా దగ్గర కింగ్ ఆఫ్ లంక అని పెట్టారు.

Similar News