విషాదం.. ఫంక్షన్‌ హాల్ గోడ కూలి ఐదుగురు మృతి

Update: 2019-11-10 10:39 GMT

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో విషాదం చోటు చేసుకుంది. గోల్నాకలో ఉన్న పెరల్‌ గార్డెన్‌ ప్రహారీ గోడ కూలడంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. మరి కొందరు శిథిలాల కింద ఉంటారని భావిస్తున్న స్థానికులు.. శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే అక్కడికి చేరుకున్న డిజాస్టర్‌ టీమ్స్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. రెండు ఆటోలు, దాదాపు పది టూ వీలర్స్‌పై గోడ కూలడంతో ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను మలక్‌పేట్‌ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జాయింట్‌ సిపి రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News