వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు : సీఎం జగన్

Update: 2019-11-11 09:08 GMT

పిల్లలు చదువుల్లో రాణించాలంటే ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరన్నారు ఏపీ సీఎం జగన్‌. ఇంగ్లిష్‌ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నవారు... వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన కుమారుడిని ఏ మీడియంలో చదవించారు, మనవడిని ఏ మీడియంలో చదివించబోతున్నారని ప్రశ్నించారు జగన్‌. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవళ్లు ఏ స్కూల్‌లో చదువుతున్నారో చెప్పాలన్నారు. నటుడు పవన్ కళ్యాణ్‌ భార్యల పిల్లలు ఏ స్కూళ్లో చదువుతున్నారని జగన్‌ అడిగారు. విజయవాడలో జరిగిన మౌలానా అబుల్‌ కలాం జయంతి వేడుకల్లో... ఇంగ్లిష్‌ మీడియం ను వ్యతిరేకించేవారిపై జగన్‌ వ్యాఖ్యలు చేశారు. పేదరికం నుంచి బయటపడాలన్నా చదువు ఒక్కటే మార్గమని తెలిపారు.

Similar News