ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టిన ఎంఎంటీఎస్‌ ట్రైన్‌

Update: 2019-11-11 06:22 GMT

హైదరాబాద్ కాచిగూడలో రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను, ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ రైలు ఆగి ఉన్న ట్రాక్‌పైకి సాంకేతిక కారణాల వల్ల MMTS రావడంతో ఆ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. చివరి నిమిషంలో దీన్ని గుర్తించిన డ్రైవర్.. ట్రైన్‌ను ఆపేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. ఇంజిన్‌ను బలంగా ఢీకొట్టడంతో 3 బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సహాయ బృందాల్ని రంగంలోకి దించారు.

ట్రాక్‌పై ఆగి ఉన్న రైల్‌ను MMTS వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన తీరు చూస్తే సిగ్నల్ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాచిగూడ స్టేషన్ లోనే ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు కూడా హడలిపోయారు.

 

Similar News