తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారి సేవలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు...ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి..
సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉండాలని ప్రార్థించానన్నారు. ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను టీటీడీ రక్షించాలని కోరారు. పురాతన ఆలయాలు గుర్తించి అభివృద్ధికి నిధులివ్వాలన్నారు. కొండగట్టు, కరీంనగర్ రామాలయాలను అభివృద్ధి చేయాలని టీటీడీ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. అలాగే వేములవాడ, ఇల్లంతకుంట రామాలయాలను కూడా అభివృద్ధి చేయాలని తెలియచేశారు