శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరంలో విషాదం చోటు చేసుకుంది. విద్యార్ధుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. బీచ్‌లో స్నానానికి వెళ్లిన ఆరుగురు విద్యార్ధులు గల్లంతు అయ్యారు. అందులో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. మరో నలుగురు జలసమాధి అయ్యారు. ఈత కొడుతూ.. సెల్ఫీలు తిరుగుతూ అప్పటి వరకూ సరదాగా గడిపిన విద్యార్ధులను అంతలోనే విధి వక్రీకరించింది. కెరటాల రూపంలో మృత్యు కబళించింది.
శ్రీకాకుళంలోని శ్రీ చైతన్య కాలేజ్‌లో ఇంటర్ సెకంట్ ఇయర్ చదువుతున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నారాయణ పండా, సంజయ్, సుధీర్, షేక్ అబీబ్, ఎల్ రాజసింహాలు కలిసి కళింగపట్నం బీచ్‌కు వెళ్లారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు కెరటాలు వారిని సముద్రంలోకి లాకెల్లాయి. వీరిలో రాజసింహా, షేక్ అబీబ్‌లు ప్రాణాలతో బయటపడగా మరో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. మెరైన్ సిబ్బంది గాలింపులో ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. సుధీర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సుధీర్, సంజయ్ డెడ్‌బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా నారాయణ పండా ఆచూకీ తెలియాల్సి ఉంది.
సముద్రంలో గల్లంతైన నారాయణ పండా మృతదేహం కోసం రెస్క్యూ టీమ్, గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కొడుకులు అలా విగత జీవులుగా పడి ఉండడం చూసి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెస్క్యూ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కోస్ట్ గార్డ్ సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని సూచించారు.
కళింగపట్నం బీచ్‌లో పర్యవేక్షణ లోపంలో ఏటా ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సముద్ర తీరం కోతకు గురి కావడం.. సముద్రం అంతకంతకు ముందుకు వస్తుండడం ప్రమాద తీవ్రను పెంచుతుందంటున్నారు. ఇప్పటికైనా పటిష్టమైన డ్రెగ్జింగ్ పనులు, కరకట్టలు ఏర్పాటు చేయాలని కోతున్నారు స్థానికులు.