మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే గవర్నర్ కోషియార్ రాష్ట్రపతిపాలనకు సిఫార్పు చేస్తూ హోంశాఖకు నివేదిక పంపినట్టు తెలుస్తోంది. దీనిపై మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. మంత్రిమండలిలో గవర్నర్ కోషియార్ సిఫార్సులను అమోదించే అవకాశాలున్నాయి.
అటు ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఎన్సీపీకి రాత్రి 8.30 గంటల వరకూ సమయం ఇచ్చారు. అయితే గడువు కంటే ముందుగానే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. సాయంత్రంలోగా ఎన్సీపీ నుంచి ఎలాంటి లేఖ అందకపోతే.. రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ నివేదించారు. అటు కేంద్రం కూడా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.