గవర్నర్‌ని కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Update: 2019-11-12 10:55 GMT

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దాదాపుగా అరగంటకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. అటు ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇసుక కొరతపై ఇటీవల పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఆ తర్వాత వైసీపీ నేతలు, పవన్ మధ్య మాటల యుద్ధ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్, గవర్నర్‌ కలయక ప్రాధాన్యత సంతరించుకుంది.

 

 

Similar News