దారులు వేరాయే

Update: 2019-11-12 10:34 GMT

తెలంగాణలో రెవెన్యూ సంఘాలు రెండుగా చీలాయి. విజయారెడ్డి హత్య తరువాత ఆందోళనలు ఉధృతం చేసిన రెవెన్యూ సంఘాలు ఇప్పుడు ఎవరికి వారు వేర్వేరుగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ట్రెసా ఆధ్వర్యంలో కీలక అధికారులంతా తమ కార్యాచరణను నిర్ణయించారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. ఇటు ప్రభుత్వంతో ట్రెసా అధికారుల చర్చలు సఫలం కావడంతో.. నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించారు.

మరోవైపు తెలంగాణ రెవెన్యూ జేఏసీ మాత్రం ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటోంది. బుధ, గురు, శుక్ర వారాల్లో రెవెన్యూ కార్యాలయాల్లో పెన్‌డౌన్‌కు పిలుపు ఇవ్వడంతో పాటు.. ప్రజా ప్రతినిధులకు మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 15న ఎమ్మార్వో కార్యాలయాల్లో వంటా వార్పు కార్యక్రమం చేపట్టి ప్రజలకు వడ్డించాలని నిర్ణయించారు. కేవలం ప్రజలకు అత్యవసరమైన సేవలు మినహా అన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

ఇలా రెవెన్యూ సంఘాలు ఎవరికి వారు వేర్వేరుగా కార్యచరణ ప్రకటించారు.

Similar News