తప్పుడు కేసులతో వేధిస్తున్నారు: అఖిల ప్రియ

Update: 2019-11-12 10:20 GMT

తమ కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఈ పరిస్థితి మరొకరికి రాకూడదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులను పెడుతోందని.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ నేతలు. రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రతిపక్షం కనిపించకుండా చేయాలని సీఎం జగన్‌ కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నవారిని టార్గెట్‌ చేస్తున్నారని విమర్శించారు.

Similar News