టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుల దాడి

Update: 2019-11-12 01:26 GMT

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామంలో టీడీపీ కార్యకర్త రామాంజనేయులుపై వైసీపీ నాయకులు దాడి చేయడంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. రెండు చేతులు విరిగాయి. అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో నెలరోజులుగా గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు రామాంజనేయులు. బంధువులను చూసేందుకు గ్రామానికి వెళ్తుండగా గోపాల్‌ మురళితోపాటు మరో ఇద్దరు కత్తులతో దాడిచేశారు. తమకు రక్షణ కల్పించాలని రామాంజనేయులు బంధువులు పోలీసులను కోరుతున్నారు.

Similar News