ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఒకటవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను తప్పని సరి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గం అభిప్రాయపడింది.. రైతులు నష్ట పోకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. త్వరగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు.