విశాఖ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుకు కృషి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Update: 2019-11-13 11:41 GMT

విశాఖ జీవీఎంసీ కార్పొరేషన్‌ పనితీరు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి. విశాఖలో పర్యటిస్తున్న ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై పలు విభాగాల అధికారులతో సమీక్ష చేశారు.

విశాఖ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద కేంద్రం నుంచి రావాల్సిన 100 కోట్ల నిధులు త్వరగా విడుదల అయ్యేలా కృషి చేస్తాను అన్నారు కిషన్ రెడ్డి. హౌసింగ్‌ కోసం 1500 ఎకరాల భూమి అవసరమని ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇసుక సమస్య తాత్కాలికమైనదే అని కిషన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Similar News