ఏపీలో ఇసుక వెబ్‌సైట్‌ హ్యాక్‌.. ‘బ్లూఫ్రాగ్‌’లో సీఐడీ సోదాలు

Update: 2019-11-13 15:21 GMT

విశాఖలోని బ్లూ ఫ్రాగ్‌ ఐటీ కంపెనీలో సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీలోని ఇసుక సరఫరా సంబంధిత వెబ్‌సైట్ హ్యాక్‌ చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.. వైబ్‌సైట్‌ను హ్యాకింగ్‌ చేసి ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టు ఆధారాలు సంపాదించారు. దీంతో సిరిపురం జంక్షన్‌లో ఉన్న కార్యాలయంలోని సర్వర్లల్లో డేటాను తనిఖీలు చేస్తున్నారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వివరాల పోలీసులు సేకరిస్తున్నారు.. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో మనశాండ్‌ సైట్‌ను నిర్వహించిన బ్లూ ఫ్రాగ్‌ ఐటీ కంపెనీపై పలు ఆరోపణలు ఉన్నాయి.

Similar News