బీజేపీ షాక్.. మరో మిత్రపక్షం కటీఫ్

Update: 2019-11-13 02:10 GMT

మహారాష్ట్రలో బీజేపీ చేతి వరకు వచ్చిన సీఎం సీటు చేజారిపోయింది. మహా పొలిటికల్ గేమ్ నుంచి తేరుకోకముందే బీజేపీకి మరో షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జార్ఖండ్ లోని మిత్రపక్షం కమలానికి కటీఫ్ చెప్పింది. బీజేపీ మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఎల్‌జేపీ తెగదెంపులు చేసుకుంది.

జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలు ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 72 స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీ మరో మిత్రపక్షం ఏజేఎస్‌యూ ఎనిమిది, ఎల్‌జేపీ ఒకస్థానంలో పోటీ చేశాయి. ఇందులో బీజేపీ 37 స్థానంలో విజయం సాధించగా.. ఏజేఎస్‌యూ ఐదు స్థానాల్లో గెలిచింది. ఎల్‌జేపీ మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఎల్‌జేపీ ఓటింగ్ శివసేనకు కలిసొచ్చింది. అయితే.. ఇప్పుడు ఎల్‌జేపీ కూడా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధపడటంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

Similar News