బాలీవుడ్ హాట్ కపుల్స్.. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండలంలో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనేలకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు.