చెన్నైలోని ఐఐటీ మద్రాస్ లో విద్యార్ధిని ఆత్మహత్య కలకలం రేపింది. కేరళకు చెందిన ఫాతిమా లతీఫ్ అనే విద్యార్ధిని హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఫాతిమా ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పద్మనాభం కారణమని తండ్రి ఆరోపిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫాతిమా స్నేహితులను, ప్రొఫెసర్లను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆత్మహత్యకు ముందు ఫాతిమా రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.