గ్యాస్ లీకై.. కరెంట్‌ వైర్లకు తాకటంతో..

Update: 2019-11-15 07:15 GMT

శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం గంగన్నపేట గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకైన ఘటన కలకలం సృష్టించింది. గ్యాస్‌ లీకై కరెంట్‌ వైర్లకు తాకి మంటలు చెలరేగడంతో ఓ ఇంట్లోని సామాన్లు బుగ్గిపాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. 5 తులాల బంగారం, ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిదయ్యాయి. 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం జరిగిన ఘటనతో స్థానికులు భయాందోలనకు గురయ్యారు.

Similar News