రాష్ట్రంలోని సమస్యలను ఢిల్లీలో వినిపించనున్న పవన్

Update: 2019-11-15 05:53 GMT

ప్రభుత్వ పాలసీలు సరిగ్గా లేకపోతే ప్రజలను చంపేయడంతో సమానమన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌. ఇసుక కొరతతో ప్రభుత్వం 50 మందిని హత్యచేసిందని ఘాటుగా ఆరోపించారు. ఇసుక కొరతతో పస్తులుంటున్న కార్మికుల కడుపు నింపే కార్యక్రమం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని మంగళగిరిలో ప్రారంభించి, వైసీపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మికులకు స్వయంగా ఆహారం వడ్డించారు. కార్తీక మాసం ఉపవాస దీక్ష వల్లే కార్మికులతో కలిసి తినలేకపోతున్నా తెలిపారు. బొత్సకు ఆకలి బాధలేంటో తెలసా అని ప్రశ్నించారు. రాజధాని మీ ఇడుపుల పాయలో కడతారా అని పవన్ ప్రశ్నించారు.

ఏపీలో ఇసుక కొరతపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఇసుక కొరతతోపాటు ఇతర అంశాలపై వివరించనున్నట్టు తెలుస్తోంది.

Similar News