ప్రేమని, ప్రతాపాన్ని చూపించిన ఆవు

Update: 2019-11-15 06:58 GMT

ఓ తల్లి ఆవుకు కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోతూ.. ఓ వ్యక్తిపై దాడి చేసింది. కసితీరా కుళ్లబొడిచింది. ఆవు కుమ్ముతుంటే ఆ వ్యక్తి ఎగిరెగిరి అవతల పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్‌ వద్ద జరిగింది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. 15 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని లేగదూడ చనిపోయింది. దూడ పక్కనే కూర్చొని తల్లి ఆవు కన్నీరుమున్నీరుగా విలపించింది. అప్పట్లో ఆ దూడను ఓ వ్యక్తి రిక్షాలో తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆ రిక్షా పుల్లర్‌ అటు వెళ్తుండటంతో.. అతడిని గుర్తుపట్టి దాడి చేసింది.

ఆ రిక్షా పుల్లర్‌పై ఆవు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో స్థానికులు వచ్చి రక్షించారు. తన బిడ్డను తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తుపట్టి దాడి చేయడంతో స్థానికులు షాకయ్యారు.

Similar News