తాను నిజంగా తప్పు చేశానని ప్రజలు భావిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తనను రాజకీయంగా భూస్థాపితం చేయడానికి 13 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుండి విడుదల అయిన ఆయన.. నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కావాలనే సెక్షన్ 30 పెట్టి పోలీసులు ఉద్యోగ ధర్మాన్ని తప్పుతున్నారని విమర్శించారు. పోలీసుల సహాయంతో ప్రతిపక్ష నాయకులను అణచివేస్తున్నారని చింతమనేని ఆరోపించారు. తనపై అక్రమ కేసులు పెడితే.. అండగా ఉన్న పార్టీ పెద్దలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.