IPS Officer Sunil Naik : సునీల్ నాయక్ విచారణ.. చట్టం నుంచి తప్పించుకోలేరు..

Update: 2026-03-05 11:44 GMT

వైసీపీ హయాంలో కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు. చట్టాలను తుంగలో తొక్కి జగన్ ను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. జగన్ అవినీతిని ప్రశ్నించినందుకు అప్పటి ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఎంతగా ఇబ్బంది పెట్టారో అంరదికీ తెలిసిందే. ఏకంగా రఘురామను కస్టోడియల్ టార్చర్ చేశారు. ఆ విషయంపై అప్పుడే రఘురామ కేసు కూడా పెట్టారు. కానీ జగన్ అధికారంలో ఉన్నంత కాలం అప్పటి సీఐడీ చీఫ్‌ సునీల్ కుమార్, ఐజీ సునీల్ నాయక్ తప్పించుకుని తిరిగారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలకు రెడీ అయింది. ఇ్పటికే ఈ కేసులో సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన్ను రిటైర్డ్ అయ్యే వరకు సస్పెన్షన్ లోనే ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక బీహార్ లో విధులు నిర్వహిస్తున్న సునీల్ నాయక్ ను కూడా ఏపీకి తీసుకొచ్చారు పోలీసులు. సునీల్ నాయక్ ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసినా అది నిలబడలేదు. విచారణ నుంచి తప్పించుకోలేరంటూ కోర్టు సీరియస్ అయింది. దెబ్బకు ఆయన సైలెంట్ గా విచారణకు వచ్చారు.

తాజాగా ఆయన దర్యాప్తు అధికారి దామోదర్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ7గా ఉన్నారు. ఐదు రోజుల పాటు ఆయన్ను విచారించబోతున్నారు దామోదర్. ఈ కేసులో సునీల్ నాయక్ అత్యంత కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. జగన్ కళ్లలో సంతోషం చూసేందుకు సునీల్ కుమార్, సునీల్ నాయక్ రెచ్చిపోయి రఘురామ కృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేశారనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వీళ్లు చిక్కుల్లో ఉంటే జగన్ కనీసం పట్టించుకోవట్లేదు. వారితో తనకేం సంబంధం లేదన్నట్టు సైలెంట్ గా ఉండటంపై వీరంతా మండిపడుతున్నారు.

జగన్ కోసం తమ ఉద్యోగాలను కూడా పణంగా పెట్టి ప్రత్యర్థులను వేధించామని.. ఇప్పుడు తమను జగన్ కనీసం పట్టించుకోకపోవడం ఏంటని మండిపడుతున్నారంట. జగన్ హయాంలో రెచ్చిపోయి టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన అనేక మంది ఐపీఎస్ అధికారుల మనో వేదన ఇదే. జగన్ ఆదేశిస్తేనే అలా చేశామని ఇప్పటికే చాలా మంది ఓపెన్ గా చెబుతున్నారు. ఇప్పుడు సునీల్ నాయక్ ను కూడా విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే వైసీపీ హయాంలో రెచ్చిపోయిన మరింత మంది ఐపీఎస్ అధికారుల్లో టెన్షన్ మొదలవడం ఖాయం.

Tags:    

Similar News