TTD Chairman BR Naidu : టీటీడీ చైర్మన్ పై అనుచి పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్.. ఇది చాలదేమో..

Update: 2026-03-05 10:00 GMT

వైసీపీ బ్యాచ్ అంతా కట్టగట్టుకుని ఇప్పుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి గారి మీద కుట్రలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీ నేతల మెడకు చుట్టుకోవడంతో.. వారంతా ఇలా కుట్రలు చేస్తున్నారు. బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత వైసీపీ అక్కడ చేసిన మహా ఘోరాలను సాక్ష్యాలతో సహా బీఆర్ నాయుడు గారు బయటపెడుతున్నారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరించి అన్ని సాక్ష్యాలను బయటపెట్టారు. ఇప్పుడు ఏకసభ్య విచారణ కమిషన్ కు కూడా బీఆర్ నాయుడు గారు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది చూసి వైసీపీ నాయకులకు నిద్ర పట్టట్లేదు. తమ బాగోతాలు అన్నీ బయటపెడుతుండటంతో ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారు. లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గుంటూరు టీడీపీ మహిళా నేత జెట్టి రేణుకతో ఏవో సంబంధాలు ఉన్నాయని.. బీఆర్ నాయుడే కారు కొనిచ్చారంటూ తప్పుడు ప్రచారాలకు తెర తీసింది వైసీపీ. దీంతో జెట్టి రేణుకా సీరియస్ పోలీసులకు కంప్లయింట్ ఇస్తే.. ఇలాంటి ఫేక్ పోస్టులు పెడుతున్న బాపట్లకు చెందిన వైసీపీ కార్యకర్త షేక్ సయ్యద్ అరెస్ట్ చేశారు పోలీసులు.

ఈ షేక్ సయ్యద్ గతంలో కూడా అనేక మంది మహిళలపై ఇలాంటి కించపరిచే పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో అతని మీద పులివెందుల, శ్రీకాకుళం, రాయలసీమలో పలు చోట్ల అనేక కేసులున్నా కూడా మారలేదు షేక్ సయ్యద్. ఇలాంటి వారిని అరెస్ట్ చేయడమే కాదు.. అంతకు మించిన కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. ఎందుకంటే నిరాధార ఆరోపణలతో వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బతీసేలా ఇలాంటి సయ్యద్ లు పోస్టులు పెడుతున్నారని.. ఇలాంటివి మరోసారి చేయకుండా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందంటున్నారు నెటిజన్లు.

టీటీడీలో వైసీపీ చేసిన అరాచకాలను బయటపెడుతున్నందుకే బీఆర్ నాయుడి గారి మీద ఇలాంటి తప్పుడు కుట్రలకు తెర తీస్తోంది వైసీపీ పార్టీ. వారి తప్పులను కప్పిపుచ్చుకోడానికి.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏఐ వీడియోలు, ఎడిటెడ్ ఫొటోలతో ఫేక్ ప్రచారాలకు.. పసలేని ఆరోపణలకు తెర తీస్తున్నారు వైసీపీ బ్యాచ్.

Tags:    

Similar News