లోస్‌సభలో తెలుగుభాషపై చర్చ

Update: 2019-11-18 07:54 GMT

లోక్ సభ ప్రశ్నోత్తరాలు మొదలైన వెంటనే తెలుగుభాషపై చర్చ జరిగింది. పురాతన భాషల్లో ఒకటైన తెలుగు భాషను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. దేశంలోని అన్ని భాషలను కాపాడేందుకు కేంద్రం చిత్తుశుద్దితో పనిచేస్తుందన్నారు. తెలుగు భాషాభివృధ్ధికి నిధులు కూడా ఇచ్చామని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ ఫోక్రియల్ స్పష్టంచేశారు. అయితే తెలుగుభాషాభివృద్దికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు భిన్నంగా.. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసిందన్నారు. దీనిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగు అకాడమీ కూడా లేదని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అకాడమీ ఏర్పాటుచేసి.. తెలుగువారి ప్రైడ్ అయిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతిని ఛైర్మన్ చేసి.. తెలుగుభాష కోసం కృషిచేస్తున్నామన్నారు.

Similar News