పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైయ్యాయి. సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అంతా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. అన్ని అంశాలపై చర్చకు ఆస్కారం ఉండేలా చూడాలన్నారు. అటు రాజ్యసభలో 250వ సభలు జరగడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా మరోసారి భారత ప్రజాస్వామ్య ఘనతను చాటే అవకాశాన్ని అందరం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.